Header Banner

మహా కుంభమేళా మరో రికార్డు! 37 రోజుల్లోనే 55 కోట్ల మంది పుణ్యస్నానాలు!

  Wed Feb 19, 2025 07:30        Devotional

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి అక్కడికి వస్తున్న భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు పుణ్య స్నానాలు చేసేందుకు కుంభమేళాకు వస్తున్నారు. ఈక్రమంలోనే 37 రోజుల్లోనే 55 కోట్ల మార్కును దాటింది. దేశ వ్యాప్తంగా కేవలం 110 కోట్ల మంది సనాతనులు ఉండగా.. ఇందులో సగం మంది పుణ్య స్నానాలు చేసి అరుదైన రికార్డు సాధించారు. ఆపూర్తి వివారలు మీకోసం. 

 

ఫిబ్రవరి 14వ తేదీకి కుంభమేళా ప్రారంభం అయిన 34 రోజులు కాగా.. 50 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి గంగ, యమున, సరస్వతీ నదులు కలిచే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసి తొలి రికార్డు సాధించారు. అయితే ఈ సంఖ్య చైనా, భారత్‌లు కాకుండా మిగాత అన్ని దేశాల ప్రజల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇది జరిగిన నాలుగు రోజులకే కుంభమేళా మరో అరుదైన రికార్డును కొట్టింది. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భారత దేశంలో మొత్తంగా 110 కోట్ల మంది సనాతనులు ఉండగా.. అందులో సగం మంది నేటితో కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. ఇలా 37 రోజుల్లోనే మొత్తంగా 55 కోట్ల మంది కుంభమేళాకు వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ విషయం గుర్తించిన ఉత్తర ప్రదేశ్ సర్కారే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవలే ఓ రికార్డు సాధించిన కుంభమేళా మరో అరుదైన రికార్డు సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. 

 

అలాగే మానవ చరిత్రలోనే ఏ మతపరమైన, సాంస్కృతిక, సమాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. అలాగే జనవరి 13 ప్రారంభం అయిన కుంభమేలా ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుండగా.. 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ముందుగా 45 కోట్ల మంది మాత్రమే వస్తారని భావించినప్పటికీ.. ఊహించని స్థితిలో జనాలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పండుగ రోజులు అయిన సంక్రాంతి రోజు 3.5 కోట్లు, మౌని అమావాస్య రోజు 8 కోట్లు, జనవరి 30వ 2 కోట్లు మంది వచ్చారని.. ఇలా ఇప్పటి వరకు 55 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొన్నట్లు చెప్పింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Kumbhamela #Festivals